‬రేపటి నుంచి కాంగ్రెస్ ప్రచారం.

హైదరాబాద్:

గురువారం ఉదయం 10 గంటలకు జోగుళాంబ దేవాలయం అలాంపూర్ నుంచి కాంగ్రెస్ ప్రచారం ప్రారంభం కానుంది.హైద్రాబాద్ నుంచి అలాంపూర్ కు హెలికాఫ్టర్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, కమిటీల చైర్మన్లు బయల్దేరి వెడతారు. జోగులంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి లాంఛనంగా ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించనున్నది.తెలంగాణ రాష్ట్రంలో ముందొస్తు ఎన్నికల నేపథ్యంలో టిఅర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం శక్తిపీఠం అయిన అల్లంపూర్ జోగుళాంబ దేవి అమ్మవారికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూమర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రచార కమిటీ సభ్యులు విజయశాంతి,డి.కె.అరుణ,రెవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,మల్లు బట్టి విక్రమార్క,సంపత్ కుమార్ ప్రచారం మొదలు పెట్టి అల్లంపూర్ బహిరంగం సభలో మాట్లాడతారు. అనంతరం శాంతి నగర్,అయిజకు చేరుకుంటారని తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు.