“100 కోట్లతో పట్నం బ్రదర్స్. నాకు 30 వేల మెజారిటీ”.

మహబూబ్ నగర్:

కేేసీఆర్ తనను ఓడించడానికి పట్నం బ్రదర్స్ కు 100 కోట్లు ఇచ్చి పంపినట్టు టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తాను 30వేల మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.కోస్గి మండల కేంద్రం నుండి భారీ బైక్ ర్యాలీతో మాజీ ఎమ్ యల్ ఏ రేవంత్ రెడ్డి మంగళవారం ప్రచారం ప్రారంభించారు.
మైనార్టీలను, గౌడ్ లను, గిరిజనులను మోసం చేసిన ఘనత trs ప్రభుత్వందేనన్నారు.
10% కమిషన్ తీసుకునే పట్నం బ్రదర్స్ ను ఓడించడం కోసం కోడంగల్ నియోజకవర్గం ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు.గిరిజనులపై , గీత కార్మికులపై బైండోవర్ కేసులు నమోదు చేసి ఉపాది లేకుండా చేశారని ఆరోపించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మైనార్టీల 12% రిజర్వేషన్ ఏమైందని ప్రశ్నించారు.