119 సెగ్మెంట్లకు 1076 మంది పోటీ.

హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టిక్కెట్ల కోసం అభ్యర్థుల దఖాస్తులకు పిసిసీ గడువు ముగిసింది. నేటివరకు పీసీసీ కి 1076 మంది అభ్యర్థుల దరఖాస్తులు అందాయి.శనివారం నుండి అభ్యర్థుల స్క్రూట్నీ మొదలయింది.
నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వనున్నారు.
అభ్యర్థుల ఎంపిక సందర్భంగా సామాజిక ,ఆర్థిక ,అంగబలం ,కుల బలాబలాలను విశ్లేషించనున్నారు.సర్వేల పలితాల ఆధారంగా గెలుపు గుర్రాలను ప్రకటించనున్నట్టు
పీసీసీ వర్గాలు తెలిపాయి.పొత్తులు, సీట్ల సర్దుబాటు తర్వాత అభ్యర్థుల జాబితాలోను పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటిస్తారు.