సీనియర్ ఐటీ అధికారులపై కొరడా

ఆర్థిక శాఖలో అవినీతి అధికారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో అవినీతి ఆరోపణలు ఉన్న దాదాపు 12 మంది సీనియర్ అధికారులను రాజీనామా చేయాల్సిందిగా సోమవారం ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశించింది. ‘చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్లు, కమిషనర్ల స్థాయిలో ఉన్న 12 మంది అధికారులను ఆర్థిక మంత్రిత్వ శాఖ 56 నిబంధన ప్రకారం బలవంతంగా పదవీ విరమణ చేయించిందని’ ఏఎన్ఐ వార్తాసంస్థ ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ట్వీట్ చేసింది. ఈ అధికారుల్లో కొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు, అక్రమాస్తులు కూడబెట్టారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.