2014 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్. – బాంబు పేల్చిన సైబర్ నిపుణుడు:

2014 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్.

– బాంబు పేల్చిన సైబర్ నిపుణుడు:

వాషింగ్టన్:

గత లోక్ సభ సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని ఈవీఎంలను రూపొందించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఆరోపించారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ ఫలితాలను రిగ్గింగ్ చేయడం జరిగిందని షుజా స్పష్టం చేశారు. బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందని తెలిపారు. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీని విడుదల చేసే మాడ్యులేటర్ తో బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందన్నారు. లోక్ సభ ఎన్నికలలో వాడిన ఈవీఎంల నుంచి సిగ్నల్స్ వస్తున్నట్టు ఏప్రిల్ 2014 తాను గుర్తించినట్టు సయ్యద్ షుజా చెప్పారు. 2009-2014 సమయంలో తాను ఈసీఐఎల్ లో పనిచేసినట్టు సయ్యద్ షుజా తెలిపారు. 2014 ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను రూపొందించిన బృందంలో తాను సభ్యుడిగా పనిచేసినట్టు షుజా తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న షుజా లండన్ నుంచి ఈవీఎంలను హ్యాకింగ్ చేయడాన్ని ప్రదర్శించారు. ఇటీవల జరిగిన ఈవీఎంలను వినియోగించిన ఎన్నికల్లో ఎక్కడ మెషీన్లను ట్యాంపర్ చేశారో తాను గుర్తించగలనని అన్నారు.