2017-2018 ఇండస్త్రీ డిపార్ట్మెంట్ వార్షిక నివేదిక విడుదల

ఇండస్ట్రీయల్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్బి బేగ్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ,ఇతర ఉన్నతాధికారులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.సీఎస్ఆర్ పోర్టల్ ను  మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.పలువురు పారిశ్రామికవేత్తలకు ,ఉత్తమ కంపనిలకు 2018 ఉత్తమ పారిశ్రామిక అవార్డ్ లు  మంత్రి కేటీఆర్ అందజేశారు.పలు కంపెనీ లతో ప్రభుత్వం
ఎం ఓ యూ కుదుర్చుకున్నది.2017-18 లో 10.4 శాతం పెరిగిన చెందిన తెలంగాణ పారిశ్రామిక వృద్ది .ఇప్పటివరకు టీఎస్ ఐ-పాస్ ద్వారా లక్షా 23 వేల 478 కోట్ల రూపాయల పెట్టుబడులు వీటితో 5 లక్షల 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాది కలుగుతుంది .
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మొదటి స్థానంలో వున్నాం.తెలంగాణ తలసరి ఆదాయం లక్షా 75 వేల 534 రూపాయలు , ఇది దేశ తలసరి ఆదాయం కంటే 55 శాతం అధికం.
ప్రతి సంవత్సరం పారిశ్రామిక రంగంలో వృద్ధి సాధిస్తున్నాం.10.4  శాతం పెరిగిన తెలంగాణ పారిశ్రామిక వృద్ధి.టి ఎస్ ఐ పాస్ ద్వారా ఇప్పటివరకు లక్ష 23 వేల 478 కోట్ల పెట్టుబదులు వచ్చాయి. 2017-18 లో 58 వేల 581 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఇప్పటివరకు టీఎస్ ఐ పాస్ ద్వారా 5 లక్షల 27 వేల ప్రత్యేక్ష ఉద్యోగాలు కల్పించాం.
ఏ పరిశ్రమకైనా 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నాం.ప్రపంచంలో టీఎస్ ఐ పాస్ బెస్ట్ ఇండస్ట్రీయల్ పాలసీ అని ప్రసంశలు వస్తున్నాయి.ఇప్పటి వరకు 6 వేల 469 యూనిట్లకు అనుమతులు ఇచ్చము ,అందులో సగానికి పైగా ఉత్పత్తులను ప్రారంభించాయి.
గత ప్రభుత్వ అయంలో 10 యేండ్లలో ఇసుక అమ్మకాల ద్వారా 39 కోట్లు ఆదాయం వస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చినకా 4 యేండ్లలో 1600 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేశాం.
ఫార్మా సిటీకి త్వరలో అన్ని అనుమతులు వస్తాయి అని భావిస్తున్నాం.ఫార్మా సిటీ భూ నిర్వాసితులకు ఇంటికి ఒక్క ఉద్యోగం ఇస్తాం.
కగజ్ నగర్ పేపర్ మిల్లు ను ఏడాదిన్నర లోగా తిరిగి పునరుద్దరిస్తాం.బయ్యారం హుక్కు కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చేలా లేవు దాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది.వాటితో సమాలోచన చేసి మేమే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామ’ని కేటీఆర్ చెప్పారు.