2019 లో కేసీఆర్ ను జైలుకు పంపుతాము. – మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి.

షాద్ నగర్:
రేవంత్ రెడ్డిని జైలు పాలు చేసి, ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని కేసీఆర్, మోడీ రహస్య ఒప్పందం చేసుకున్నారని టిఆర్ ఎస్ కు పోయే కాలం దాపురించిందనీ, రేవంత్ అరెస్ట్ తో కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఆపలేరనీ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఢీ కొట్టలేక కేసీఆర్ రేవంత్ కు భయపడి దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్నారని విమర్శించారు.
అదే విదంగా కొడంగల్ లో రేవంత్ ను ఓడ గొట్టడానికి వంద కోట్ల మూటలతో పట్నం ముఠాలను పంపారని దీనిలొ భాగంగానే ఈడీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.కెసిఆర్ జైలు కు పంపిన ఎక్కడికి పంపిన కాంగ్రెస్ మెజారిటీతో కొడంగల్ లో గెలుస్తుందని, అరెస్ట్ చేసిన కూడా జైల్ లో ఉండి రేవంత్ నామినేషన్ వేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకుని వస్తుందని అప్పుడు కెసిఆర్ కు వడ్డీతో సహా కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని విమర్శించారు.