రూ.21.42 లక్షల డ్యుకాటీ బైక్ కొన్న ‘జగ్గీ’ !!

రూ.21.42 లక్షల డ్యుకాటీ బైక్ కొన్న ‘జగ్గీ’ !!
sadguru on ducati bike

కోయంబత్తూరు:

ప్రపంచంలో దాదాపుగా ప్రతి విషయంపై తన ఆచరణాత్మక ఆలోచనలు, ప్రసంగాల ద్వారా సద్గురుగా ప్రపంచ ఖ్యాతి గడించారు జగ్గీ వాసుదేవ్. రెండో డ్యుకాటీ బైక్ కొని ఆయన మరోసారి సూపర్ బైకులంటే తన ఇష్టాన్ని చాటుకున్నారు. ద్విచక్ర వాహనాలపై తరచూ షికార్లు చేయడాన్ని ఇష్టపడే సద్గురు దగ్గర ఇప్పుడు డ్యుకాటీ డెసర్ట్, సరికొత్త డ్యుకాటీ మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ ఎడిషన్ బైకులు ఉన్నాయి. డ్యుకాటీ మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ ఎడిషన్ ధర భారత్ లో రూ.21.42 లక్షలుగా ఉంది. ‘ఈశా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడైన జగ్గీ వాసుదేవ్, తన సంస్థ ద్వారా యోగా, ఆరోగ్యాన్ని పెంపొందించే ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీలు చిక్కినపుడల్లా ఆయన ద్విచక్ర వాహనంపై షికారు చేయడాన్ని ఇష్టపడతారు. గత ఏడాది ఆగస్టులో సద్గురు బాబా రామ్ దేవ్ ని బైక్ పై ఎక్కించుకొని కొయంబత్తూరులోని తన సంస్థ ఆవరణలో చక్కర్లు కొట్టారు.టాప్ స్పెసిఫికేషన్లు ఉండే మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బైక్ ధర ప్రస్తుతం రూ.21.42 లక్షలు (ఎక్స్ షోరూమ్ భారత్)గా ఉంది. దేశంలో వీటిని అతి తక్కువ మాత్రమే అమ్మాలని కంపెనీ భావిస్తోంది. సాధారణ 1260 కంటే పైక్స్ పీక్ వెల రూ.5.43 లక్షలు ఎక్కువ. కంపెనీ ఇప్పటికే 1260, 1260ఎస్ డెలివరీ ప్రారంభించింది. వచ్చే నెల మధ్య నుంచి పైక్స్ పీక్ బైకులు డెలివర్ చేస్తుంది. 1262సీసీ లిక్విడ్ కూల్డ్ ఎల్-ట్విన్ యూనిట్ ఉండటం ఈ పైక్స్ పీక్ ప్రత్యేకత. 158హెచ్ పి పవర్, 9500 ఆర్పీఎం, 129.5 ఎన్ఎం పీక్ టార్క్ ని ఈ మోటార్ విడుదల చేయగలదు.