22 కేజీల బంగారు చీర..!

కోల్ కతా:
దసరా వచ్చిందంటే పశ్చిమ్‌బంగాలో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేసి సందడి చేస్తుంటారు. ప్రస్తుతం కోల్‌కతాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు లండన్‌ థీమ్‌తో మండపం అయితే బంగారంతో తయారు చేసిన అమ్మవారి చీర మరోవైపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజా కమిటీ దుర్గామాత కోసం దాదాపు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్‌ ఈ చీరను డిజైన్‌ చేశారు. దాదాపు 50 మంది నిపుణులు ఈ చీర తయారీకి శ్రమించారు. పువ్వులు, పక్షులు, సీతాకోక చిలుకలు, నెమళ్ల బొమ్మలను చీరపై ఎంబ్రాయిడరీ చేశారు.