29న గద్వాలలో కేసీఆర్ పర్యటన.

హైదరాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. గట్టు ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేస్తారు. అదే రోజు గద్వాలలో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.