5 కోట్ల మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ లు!

రాబోయే ఐదేళ్లలో రూ. 5 కోట్లను ఐదు కోట్ల మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ లుగా ఇవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త లక్ష్యం పెట్టుకొంది. స్కూల్ బోర్డు పరీక్షలకు ముందు ఆ తర్వాత వివిధ ఉపకార వేతనాల కింద 5 కోట్ల మంది విద్యార్థులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఈ 5 కోట్ల మంది విద్యార్థుల్లో 50 శాతం బాలికలు ఉంటారని కేంద్ర అల్పసంఖ్యాక వర్గాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ప్రకటించారు.


స్కూళ్లు మానేసిన మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలను ఈ పథకంలో చేరుస్తారు. ఈ పథకాన్ని వారి విద్య, ఉద్యోగాలతో అనుసంధానం చేస్తారు. వారికి దేశంలోని సుప్రసిద్ధ విద్యా సంస్థల నుంచి బ్రిడ్జి కోర్సులు అందజేస్తారు.


దేశవ్యాప్తంగా ఉన్న మదర్సా ఉపాధ్యాయులకు వివిధ సంస్థల ద్వారా ప్రధాన సబ్జెక్టులలో శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తారు.


ఈ ఉపకార వేతనాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఇచ్చే 10 లక్షలకు పైగా బేగమ్ హజ్రత్ మహల్ గర్ల్స్ స్కాలర్షిప్ లు కూడా ఉండనున్నాయి.

NDA announces Rs 5 crore scholarship for students belonging to minority communities

India, National, NDA, Narendra Modi, Scholarships for minorities, Scholarship, Minority Scholarship, Modi Government, Scholarships to Minority Students, Mukhtar Abbas Naqvi, Maulana Azad Education Foundation, Madrasa, Minority Communities, Scholarships