5 న బోనాలు,6 న ఊరేగింపు. – మంత్రి తలసాని.

హైదరాబాద్:
హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఈ నెల 5 న బోనాలు, 6న ఊరేగింపులను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న ట్లు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం ఓల్డ్ సిటీ లోని హరిబౌలి బంగారు మైసమ్మ , శ్రీ అక్కన్న మాదన్న, శ్రీ గౌలిపురా శ్రీ భారతమ్మ, శ్రీ ముత్యాలమ్మ, లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయాల వద్ద చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు.లాల్ దర్వాజ వద్ద అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు.మన పండుగల గొప్పతనాన్ని ,సంస్కృతిని ప్రపంచమునకు చాటి చెప్పాలని, చిన్న దేవాలయాలకు కూడా అండగా నిలవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కే.సి.ర్. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి రూ.15 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. లక్షలాది మంది మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని, ఓల్డ్ సిటీ దేవాలయాలలో బోనాలు సమర్పిస్తారని, మహిళా పోలీసులను నియమించనున్నట్లు తెలిపారు.ట్రాఫిక్ సమస్యలు అధిగమించుటకు పటిష్టమైన బందోబస్తు, బారికేడింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.అధికారుల తో సమన్వయంగా ఉండి, అవసరమైన పనులు చేయించు కోవాలని దేవాలయాల కమిటీ లకు సూచించారు. నిరంతర విద్యుత్తు సరఫరా కు జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ కై అదనపు సిబ్బందిని నియమించాలని ,సరిపడ నీటిని సరఫరా చేయాలని చెప్పారు.