50 లక్షల మందిని చంపే కెమికల్స్ పట్టివేత.

ఇండోర్:
మనుషుల ప్రణాలను క్షణాల్లో చంపేసే ప్రమాదకరమైన కెమికల్స్ ను పట్టుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో వారం పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌ మెంట్ సైంటిస్టులతో కలిసి ఈ కెమికల్‌ ను పట్టుకున్నారు. 9 కిలోలకుపైగా సింథ‌టిక్‌ ఒపియాడ్, ఫెంటానిల్ రసాయనాలను ఓ అక్రమ లేబొరేటరీ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఈ రసాయనానికి సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల మందిని చంపగలిగే శక్తి ఉంటుందని చెప్పారు సైంటిస్టులు. రసాయన యుద్ధాల్లో వీటిని వాడుతారని తెలిపారు. లెసైన్స్ లేని ఈ అక్రమ లేబొరేటరీని ఓ PHD స్కాలర్, స్థానిక వ్యాపారవేత్త నడిపిస్తున్నాడు. మెక్సికో దేశానికి చెందిన వ్యక్తితో పాటు ఈ లేబొరేటరీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెంటానిల్ అనే డ్రగ్ చాలా ప్రమాదకరం. రెండు మిల్లీగ్రాముల ఈ డ్రగ్ ఓ వ్యక్తిని చంపగలదు. ఇండియాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఇది చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద స్థాయిలో ఈ రసాయనాన్ని తయారు చేయడానికి చాలా నైపుణ్యం కావాలని, కేవలం శిక్షణ పొందిన సైంటిస్టులే ఈ పని చేయగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.