6 న అమిత్ షా హైదరాబాద్ రాక!!

Hyderabad:

దేశవ్యాప్తంగా జులై 6 నుంచి పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వనమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. మొదటిరోజు ప్రధాని మోడీ వారణాసి నుంచి పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. అదే రోజు తెలంగాణలో పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిత్ షా వస్తారని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని శంషాబాద్ లోని కేఎల్​సీసీ ఫంక్షన్​ హాల్​లో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీకి ఉన్న సభ్యత్వానికన్నా అదనంగా 12 లక్షల మంది కొత్తవారిని చేర్చుకోవాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదులో యువకులు, మహిళలు, అన్ని సామాజిక వర్గాలవారిని చేర్చుకోవాలని సమావేశంలో అమిత్ షా సూచించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వియోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని నిలదీశారు. దీన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 17 న రాష్ట్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అవసరమైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానిస్తామని తెలిపారు.