7 గురు రెవెన్యూ ఉద్యోగులు ‘ఔట్’.

రాజన్న సిరిసిల్ల :
మంత్రి కేటీఆర్ పర్యటన కు ఒక రోజు ముందు జిల్లాలో 7 గురు రెవెన్యూ ఉద్యోగులపై వేటు వేశారు.భూ రికార్డుల ప్రక్షాళనలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీర్నపల్లి మండలం తహసీల్దార్ విజయలలిత తో పాటు, గంభీరావుపేట మండలంలో ముగ్గురు వీఆర్వోలు, ముస్తాబాద్ మండలంలో ఇద్దరు వీఆర్వోలు, వేములవాడ రూరల్ మండలంలో ఒకరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.