791 కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు.

న్యూడిల్లీ;
ఆంద్రప్రదేశ్, తెలంగాణాతొ సహా 11 రాస్ట్రాలకు చెందిన 791 కేసులను “ఫాస్ట్ ట్రాక్ కోర్టు” లకు కేంద్రప్రభుత్వంబదిలీ చేసింది. ఈ కేసుల్లో పార్లమెంటు, శాసనసభ్యులతొ సహా ఉన్నత పదవులలోనున్న నేతలు ముద్దాయిలుగా ఉన్నారు. అత్యంత కీలకమైన 2జిస్పెక్ట్రం కేసు, సునంద పుష్కర్ హత్య, నేషనల్ హెరాల్డ్ తదితరకుంభకొనాలున్నాయి. ముఖ్యంగా వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా కు చెందిన కీలక నాయకులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 791 కేసులను 12 ఫాస్టు ట్రాక్ కొర్టులకు అప్పగించడం తీవ్ర సంచలనం సృష్టిస్తున్నది. ఈ నిర్ణయం ద్వారామరికొద్దిరొజులలో చాలా మంది బండారాలు బయటపడనున్నాయి.