పేద ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం దేశంలో అత్యధిక నిధులను కెటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ.

నిజామాబాద్.
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం దేశంలో అత్యధిక నిధులను కెటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మనసున్న మహరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి   కెసిఆర్  ఎన్నికల హామీలు అమలు చేయడమే కాదు, అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.   వర్నీ మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలను బుధవారం ప్రారంభించారు. కళ్యాణలక్ష్మీ, షాదిముభారక్, కెసిఆర్ కిట్, ఎకరాకు రూ. 8000 లు ఇచ్చే రైతుబందు పథకం, రైతుభీమా ఇంకా అనేక పథకాలు ఎన్నికల మానిఫెస్టోలో లేకపోయినా ప్రజల, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి  అమలు చేస్తున్నారన్నారు. తమ బిడ్డి పెళ్ళికి ఏ పేదింటి తల్లిదండ్రులు అప్పు చేయకూడదని కళ్యాణలక్ష్మీ, షాదిముభారక్ పథకం ద్వారా రూ. 1,00116 లను అందిస్తున్నారు. తల్లీ, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కెసిఆర్ కిట్ అందిస్తున్నారు. తొలకరి వర్షాలు కురవగానే పంట సాగు కోసం పెట్టుబడికి డబ్బులు లేక ఏ రైతు ప్రవేటు వ్యాపారుల వద్ద చేయిచాచకూడదన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశయం. స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి గారికి రైతుల కష్టాలు తెలుసు. అందుకే ముందస్తు పెట్టుబడిగా ప్రతి ఎకరాకు రూ. 8000 రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మరో అద్భుత పథకం రైతుభీమా. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే, అతనిపై ఆధారపడిన కుటుంబం ఇబ్బందుల పాలవ్వకుండా రూ. 5 లక్షల భీమాను ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రతి రైతుకు రూ. 2771 చొప్పున మొత్తం ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వచ్చే అగస్టు 15 నుండి ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతును కలిసి ధరఖాస్తు నింపడంతో పాటు, నామిని పేరును కూడా సేకరిస్తారు.రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించడానికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. గోదావరి, మంజీర నదులపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు, బ్యారేజీల నిర్మాణంతో మనకు వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం నీళ్ళు పుష్కలంగా ఉన్న ప్రాణహిత నుండి నీటిని తరలించడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. గతంలో సర్వేలు, డిజైన్ల తోనే దశాబ్ధాలు గడిచేది. కాని నేడు తెలంగాణ ప్రభుత్వం మూడు ఏళ్ళలోనే ప్రాజెక్టుల డిజైనింగ్ పూర్తి చేసి నిర్మాణాన్ని కూడా పూర్తిచేస్తుంది. త్వరలోనే కాళేశ్వరం ద్వారా గోదావరి నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తాయి. వచ్చే ఏడాది నుండి 300 రోజులు నిజాంసాగర్ కాలువలో నీళ్ళు పారుతాయి. చెరువులలో 365 రోజులు నీళ్ళు నిండుగా ఉంటాయి.అంతకుముందు వర్ని, శ్రీనగర్, పాతవర్ని గ్రామంలో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. రూ. 2.20 కోట్లతో నిర్మించిన R&B బ్రిడ్జిని, రూ. 16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ నూతన భవనం, రూ. 8. 5 లక్షలతో నిర్మించిన అంభేడ్కర్ భవనం, రూ 7 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ. 5 లక్షలతో నిర్మించిన యూత్ భవన్, రూ. 15 లక్షలతో నిర్మించిన సిసీ రోడ్లను ప్రారంభించారు.