పటేల్ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి.. 93ఏళ్ల ముసలాయన.

అహ్మదాబాద్:
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. గుజరాత్లోని ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ .. అంటే ఐక్యతా విగ్రహాన్ని ఇవాళ (అక్టోబర్- 31)వ తేదీన మోడీ ఆవిష్కరించనున్నారు. అయితే ప్రపంచంలోనే రికార్డుకెక్కనున్న అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి గురించి తెలుసుకుందాం. ఇంతపెద్ద పెద్ద కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది 93 ఏళ్ల ముసలాయన. అతడే..మహారాష్ట్రకి చెందిన రామ్‍ వన్జీ సుతార్‍. ఇతడి వయసు (93) ఏళ్లు. అయిదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఎత్తు ఉన్న ఆ ముసలాయన ఇప్పటికి కొన్ని వేల విగ్రహాలను తయారు చేశారు. అంతే కాకుండా అరేబియన్‍ సముద్రం మధ్య భాగంలో పెట్టే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహం. సుతార్‍ ఇప్పటికి కొన్ని వేల విగ్రహాలను తయారు చేశారు. జవహర్‍ లాల్‍ నెహ్రూ, ఇందిరాగాంధీ, భగత్‍ సింగ్‍ లాంటి అనేక మంది ప్రముఖుల విగ్రహాలను ఆయన రూపొందించారు. అందరి కంటే గాంధీజీవి గ్రహాలు ఎక్కువగా తయారుచేశారు. పరమవీర చక్ర పొందిన వారి విగ్రహాలను కూడా ఆయన తయారు చేస్తున్నారు. వాటిని ఇండియా గేట్‍ వద్ద నేషనల్‍ వార్‍ మెమోరియల్‍ లో ఉంచనున్నారు.