ఎఫ్ఐఆర్ కోసం ఇన్ స్పెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ

ఎఫ్ఐఆర్ కోసం ఇన్ స్పెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ

నిరుపేద మహిళకు అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. తనకు అన్యాయం చేసినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరిందా మహిళ. కానీ అక్కడి ఇన్ స్పెక్టర్ ఉలక లేదు. పలక లేదు. నెత్తీనోరూ కొట్టుకున్నా వినిపించుకోలేదు. చివరికి వయసులో చిన్నవాడైనా ఆ ఇన్ స్పెక్టర్ కాళ్లు మొక్కింది. వినడానికి ఇదేదో బాలీవుడ్ మసాలా సినిమాలోని సీన్ లా అనిపించినా అక్షరాలా జరిగిందిదే. ఇది బీజేపీ తన పరిపాలనలో రామరాజ్యంగా మారిందని చెప్పుకొంటున్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.