అబ్బో.. ఇంత స్పీడా!!

న్యూఢిల్లీ:

సుప్రీంకోర్టు జడ్జీల నియామకం అంటే ఒకప్పుడు నెలల తరబడి సాగే ప్రక్రియ. కొలీజియం జడ్జిల ఎంపిక చేయడానికి కొన్ని నెలలు పడితే దానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడానికి మరికొన్ని నెలలు పట్టేది. కానీ ఇవాళ నలుగురు జడ్జిల ప్రమాణ స్వీకారం చూస్తే అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ స్పీడు చూసి సాక్షాత్తూ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆశ్చర్యచకితులయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిలుగా నలుగురితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మాట్లాడుతూ ఈ చారిత్రక స్పీడు చూసి నివ్వెరపోయానని చీఫ్ జస్టిస్ గొగోయ్ అన్నారు. కొలీజియం జడ్జిల పేర్లు సిఫార్సు చేసిన 48 గంటల్లో ఆమోదం లభించడం, ప్రమాణ స్వీకారం జరిగిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.