ప్రమోషన్లలో రిజర్వేషన్లు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు:

రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారికి చెంపపెట్టులా సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది.
ఎస్సీ / ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అవసరం లేదంటూ సుప్రీం కోర్టు వెల్లడించింది. ప్రమోషన్‌లలో​ ఎస్సీ / ఎస్టీ ఉద్యోగుల ‘రిజర్వేషన్‌ కోటా’ ప్రయోజనాలు పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ 2006(నాగరాజు కేసులో) వచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ సంచలన తీర్పు ప్రకటించింది. ఈ సందర్భంగా నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం లేదంది. దేశంలో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ సందర్భంగా ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయడం కుదరదని ప్రకటించింది.