తెలంగాణలో రూ.100 కోట్లతో ‘ఆదియోగి’ విగ్రహం.

హైదరాబాద్:

తెలంగాణలో రూ.100 కోట్లతో ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్‌. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం వద్ద పొట్టిగుట్టపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహాంతో పాటు పరిసరాల్లో వనమూలికల తోటలను కూడా పెంచుతామన్నారు. కోనరావుపేట మండలంలోని నాగారం వద్దనున్న గుట్టలను పరిశీలించాలన్న మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు సూచన మేరకు నిన్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌ లో వచ్చి.. తన టీమ్ తో గుట్టపై మట్టిని, పరిసరాలను పరిశీలించారు. 25 ఎకరాల్లో ఉన్న పొట్టిగుట్టను ఈషా ఫౌండేషన్‌ కు అప్పగించనున్నారు. ప్రజారోగ్యానికి అవసరమైన వనమూలికల తోటల పెంపకానికి పొట్టిగుట్ట అనువైన ప్రదేశమన్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.