చంద్రబాబుకు అఖిలేష్ ఫోన్.

లక్నో:

సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో సహా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని అందుకు అందరం కలిసికట్టుగా పోరాడక తప్పదని అఖిలేష్ చెప్పినట్టు టీడీపీ వర్గాలు చెప్పాయి. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగడుతున్న చంద్రబాబు కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించినట్టు తెలిసింది. చంద్రబాబు ప్రయత్నానికి తమ మద్దతు ఉంటుందని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీకి పయనం అవుతున్నారు.