ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ మరోసారి హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసే పని చేసింది. అమెజాన్ తన వెబ్ సైట్ లో శివుడు, గణేశుడు ప్రింట్ చేసిన డోర్ మ్యాట్లను అమ్మకానికి పెట్టింది. దీనిపై సోషల్ మీడియా భగ్గుమంది. ముఖ్యంగా ట్విట్టర్ లో #BoycottAmazon ట్రెండ్ అవుతోంది.
What the hell is this Amazon? (@AmazonHelp, @amazon)
How many times you will hurt the sentiments of Hindus? Why do you do this every year, every time? Till when will this continue? Will it ever stop? pic.twitter.com/XuwlHHu4qY
— Anshul Saxena (@AskAnshul) May 16, 2019
సోషల్ మీడియా సైట్లలో జనం అమెజాన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. యూజర్లు అమెజాన్ యాప్ ని అన్ ఇన్ స్టాల్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ ఉత్పత్తుల అమ్మకంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజల ఆగ్రహావేశాలు చూసి అమెజాన్ తన సైట్ నుంచి ఈ డోర్ మ్యాట్ల అమ్మకాన్ని తొలగించింది. కానీ జనం మాత్రం శాంతించడం లేదు.
ట్విట్టర్ లో ఒక యూజర్ అయితే గతంలో అమెజాన్ చేసిన ఇవే తప్పులను గుర్తు చేసే ఫోటో షేర్ చేస్తూ, ‘అమెజాన్ ఇలా ఎన్నో సార్లు చేసింది. కానీ మనం మన తప్పుల నుంచి ఏం నేర్చుకోవడం లేదు. మళ్లీ మళ్లీ ఇట్టే నమ్మేస్తున్నాం’ అని పేర్కొంటే మరొకరు ‘అమెజాన్ కి గుణపాఠం నేర్పించాలంటే దాని రేటింగ్ తక్కువ ఇవ్వాలి. అలాగే యాప్ అన్ ఇన్ స్టాల్ చేయాలని’ పిలుపు నిచ్చారు.
Amazon faces boycott call after doormats with images of Indian deities go on sale
India, National, Business, Technology, Industry, E-Commerce, Amazon, Doormats, Twitter, Social Media, Boycott Amazon, Online Shopping Giant, Selling, Hindu God, Print, Doormat, Online Shopping Website