‘అమెజాన్’ గ్రేట్ ఇండియన్ సేల్: సూపర్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్.

‘అమెజాన్’ గ్రేట్ ఇండియన్ సేల్:
సూపర్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్.

null

న్యూఢిల్లీ:

భారత్ లో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మరోసారి తమ సేల్స్ తో ముందుకొచ్చాయి. ఆదివారం తమతమ రిపబ్లిక్ డే సేల్స్ ప్రారంభించాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 23 జనవరి, 2019తో ముగియనుంది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 22, 2019 వరకు మాత్రమే కొనసాగనుంది. ఆకర్షణీయమైన ఎక్స్చేంజి ఆఫర్లు, ఊరించే డిస్కౌంట్ డీల్స్ తో పాటు రెండు దిగ్గజ ఈ-కామర్స్ వెబ్ సైట్లు ఎస్బీఐ, హెచ్ డిఎఫ్ సి డెబిట్/క్రెడిట్ కార్డులతో నో ఈఎంఐ ఆప్షన్ కింద కొనుగోలు చేస్తే 10% ఇన్ స్టెంట్ అదనపు డిస్కౌంట్లు అందిస్తున్నాయి.ఇక టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ లో ఎన్నో లేటెస్ట్ ఫోన్లపై అదరగొట్టే ఆఫర్లు ఇస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో ఇస్తున్న కొన్ని ఫోన్లు, వాటిపై ఆఫర్లను ఒకసారి చూద్దాం.
వన్ ప్లస్ 6టి:
ఎక్స్చేంజి ఆఫర్ లో అమెజాన్ రూ.2,000 డిస్కౌంట్ అదనంగా ఇస్తోంది. 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఇస్తున్నారు. అన్ని తగ్గింపులు పోనూ వన్ ప్లస్ 6టి ఫోన్ సుమారుగా రూ.30,467కి లభిస్తుంది. మీ ఫోన్ ఎక్స్చేంజి విలువను బట్టి ఫోన్ ధరలో మార్పు ఉండవచ్చు.
రియల్ మి యు1 (3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ):
రియల్ మి యు1 బేస్ మోడల్ ఫోన్ ధర రూ.11,999. కానీ సేల్ లో ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999కే దొరుకుతుంది. రియల్ మి యు1 పెద్ద 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డి+ వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, 13ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరా, 25ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 కలర్ ఓఎస్ 5.2, 3500ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
యాపిల్ ఐఫోన్ ఎక్స్:
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో 64జీబీ యాపిల్ ఐఫోన్ ఎక్స్ రూ.74,999కే లభిస్తోంది. అంటే దీనిపై రూ.16,901 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక 256జీబీ వేరియంట్ రూ.18,931 డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.89,999కి కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎఫ్1:
రూ.23,999 ధర ఉండే పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ సేల్ లో రూ.19,999కి దొరుకుతోంది. షావోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో ఎఫ్1లో 12 మెగాపిక్సెల్ రియల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ 6జీబీ ర్యామ్, 64జీబీ రామ్ వేరియంట్ పై రూ.4,000 డిస్కౌంట్ అందజేస్తోంది.