ఐఏఎస్ అమ్రపాలీ కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా ఉత్తర్వులు

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఆమ్రపాలి కాట బదిలీ అయ్యారు. ఆమెతో పాటు అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా కె.శశికిరణాచారి కూడా విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్వీసులోకి బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. వారిని కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని కేంద్ర హోమ్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గా పనిచేసిన ఆమ్రపాలి, ఆపై జీహెచ్‌ఎంసీకి బదిలీ అయి, అడిషనల్‌ కమిషనర్‌ గా కొనసాగుతున్నారు.