సౌర కుటుంబంలో కొత్త గ్రహం.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
సౌర కుటుంబంలో మరో కొత్త గ్రహం వచ్చి చేరింది. ప్లూటో తర్వాత మంచుతో గడ్డ కట్టిన ఈ కొత్త మరుగుజ్జు గ్రహాన్ని కనుగొన్నారు నాసా శాస్త్రవేత్తలు. దీనికి గోబ్లిన్ అని నామకరణం చేశారు. 2015లోనే అంతరిక్షయానం చేసిన వ్యోమగాములు ఈ గ్రహాన్ని కనిపెట్టారు. కార్నెగీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పనిచేస్తున్న వ్యోమగామి స్కాట్ షెపర్డ్ … ప్లూటో తర్వాత ఓ కొత్త గ్రహం ఉందని చెప్పారు. ఈ గ్రహానికి ఇంటర్నేషనల్ అస్ట్రనామికల్ యూనియన్ మైనర్ ప్లానెట్ సెంటర్ అధికారికంగా 2015 TG387 అనే పేరు ఇచ్చింది. భూమి నుంచి టెలిస్కోప్ ద్వారా పూర్తి స్థాయిలో పరిశీలన, పరిశోధనలు జరిపిన తర్వాత అక్టోబర్ 2న అధికారికంగా సౌరమండలంలో గోబ్లిన్ అనే గ్రహం ఉందని ప్రకటించారు. ఇది సౌర వ్యవస్థలో కనుగొన్న మూడో మరుగుజ్జు గ్రహం. గాబ్లిన్ కక్ష్య చాలా పొడవుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించేందుకు దీనికి 40వేల సంవత్సరాల సమయం పడుతుంది. సూర్యుడి నుంచి భూమికంటే 2,300 రెట్ల దూరంలో గాబ్లిన్ గ్రహం ఉంది. ఒక అస్ట్రానామికల్ యూనిట్ (ఏయు)93 మిలియన్ మైళ్లు (సుమారుగా 150 మిలియన్ కిలోమీటర్లు). గాబ్లిన్, సూర్యునికి మధ్య దూరం 65 ఏయులు. అదే ప్లూటో అయితే సుమారు 30 ఏయూ నుంచి 50 ఏయూల మధ్య ఉంటుంది.రెండు మరుగుజ్జు గ్రహాలు ఉన్నట్టు అంతరిక్ష శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 2003లో కనుగొన్న సెడ్నా 620 మైళ్ల దూరంలో, 2012 VP113 గ్రహం 310 మైళ్ల దూరంలో గుర్తించారు. ఇలాంటి మరుగుజ్జు గ్రహాలు సౌర కుటుంబంలో చాలానే ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో కొన్ని భూమి కంటే పెద్దవి. ఇవన్నీ సూర్యునికి కొన్ని వందల అస్ట్రానామికల్ యూనిట్ల దూరంలో ఉన్నాయని చెప్పారు.