అంటార్కిటికాలో ఘనీభవించిన కెరటాలు.. అలా ఎలా?

antarctica-waves

న్యూఢిల్లీ:

ఒక్కసారి ఊహించండి. మీరు కడలి కెరటాలపై సయ్యాటలాడుతూ సర్ఫింగ్ చేస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్నట్టు ఎగసిపడుతున్న అలలు అకస్మాత్తుగా అలాగే ఘనీభవిస్తే.. ఊహించడానికి ఊహే చాలడం లేదు కదూ.. నిజజీవితంలో ఇలాంటివి జరగవు. అలా జరగడానికి ‘ఫ్రోజెన్‘ సినిమాలోని ఎల్సా మాయ చేయడానికి రాబోదు. కానీ అంటార్కిటికాలో మాత్రం అక్షరాలా అలాగే జరిగింది. ఉత్సాహంగా సర్ఫింగ్ బోర్డ్ తీసుకొని అలలను అలవోకగా చీల్చుకొంటూ కెరటాలపై సయ్యాట ఆడుతున్న వాళ్లంతా ఈ హఠాత్ పరిణామంతో షాకయ్యారు.అంటార్కిటికాలో ఇంతెత్తున ఎగసిపడే కెరటాలు అలాగే గడ్డకట్టిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందంటే ఒత్తిడి కారణంగా మంచు దగ్గరకు కుదించుకుపోయినపుడు అందులో చిక్కుకున్న బుడగలు బయటికి వస్తాయి. మంచు కరగడం, తిరిగి గడ్డకట్టడం కారణంగా నీలం రంగు వస్తుంది. ఇది చిక్కుపడ్డ గాలిని బయటికి గెంటి వర్ణమాలలోని నీలం రంగు ప్రతిఫలించేలా చేస్తుంది. ఎరుపుని మాత్రం పీల్చేస్తుంది.