విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే ‘కిడారి’ కాల్చివేత.

విశాఖపట్నం:
అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పాటు ఆయన అనుచరుడ్ని మావోయిస్టులు ఆదివారం కాల్చిచంపారు. ఘటనాస్థలంలోనే ఎమ్మెల్యే కిడారి మరణించారు. కిడారి కొద్ది రోజుల కిందటే వైఎస్సార్ సిపి నుంచి టీడీపీలో చేరారు. పలుమార్లు ఎమ్మెల్యే కిడారికి మావోయిస్టుల నుంచి గతంలో బెదిరింపులు వచ్చాయి.2014 లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.