‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ.

‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం
త్వరలో భూమి పూజ.

null

– అల్లం నారాయణ:

మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ఇంజనీరింగ్ అధికారులను కోరారు. త్వరలో శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ఆయన కోరారు. ప్రెస్ అకాడెమీని గతంలో సందర్శించిన ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పినట్లు ‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’లాగా నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన అన్నారు.
మంగళవారం నాడు చైర్మన్ అల్లం నారాయణ మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మీడియా అకాడమి భవనాన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాలుగు అంతస్తులతో నిర్మించే ఈ భవనం జర్నలిస్టులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నదని తెలిపారు. భవన నిర్మాణం పూర్తి అయితే అకాడమి తరుపున శాశ్వతంగా జర్నలిజం కోర్స్ రూపొందిస్తామని ఆయన అన్నారు. అకడమిక్ గా కాకుండా పత్రికలకు, చానెళ్లకు నేరుగా ఉపయోగపడేవిధంగా ఈ కోర్స్ రూపకల్పన జరుగుతున్నదని ఆయన చెప్పారు. నాలుగు అంతస్తుల భవనంలో 300 మందికి సరిపడే సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ లక్ష్మణ్ కుమార్, ఏ.ఓ. యాదగిరి, రహమాన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.