గిరిజనుల్లో బతికున్న ‘వస్తుమార్పిడీ’ సంప్రదాయం. – వంశీ పసలపూడి:

గిరిజనుల్లో బతికున్న
‘వస్తుమార్పిడీ’ సంప్రదాయం.

– వంశీ పసలపూడి:

అరకు నుంచి జైపూర్ వెళ్ళే రోడ్డులో 62km కు లంప్టపుట్ అనేగ్రామం వస్తుంది. అక్కడ నుంచి ఎడమ చేతి వైపు 25km వెలితే ఒనక ఢిల్లి వస్తుంది. ప్రతీ లక్ష్మివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 7 గంటల వరకూ జరిగే సంతకి ఒరిస్సాలో అనేక ఆదిమ జాతుల్లో ఒకటైన, అత్యంత కఠినమైన సాంప్రదాయాలు పాటించే “బొంఢా” జాతి గిరిజనులు, ఈ సంతకు అటవీ ఉత్పత్తులు, తేనె, అడవి దుంపలు, రకరకాల మత్తు పానీయాలను, తీసుకొని వచ్చి, వస్తు మార్పిడి పధ్ధతుల్లో అమ్ముతుంటారు. ఊరికి సుమారు 50km దూరంలోని కొండ ప్రాంతంలోంచి నడుచుకుంటా వస్తుంటారు.
ఈ సంతకి విదేశాల నుంచి టూరిస్టులు చూడటానికి వస్తుంటారు. “బొంఢా” జాతి స్త్రీలు తమకంటే వయసులో 15 సంవత్సరాలు చిన్నవాడిని పెళ్లి చేసుకుంటారు. ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చు. ఒక మనిషి హోదాని ఆమెకున్న ఆవులను బట్టి లెక్కగడతారు. సుమారు 20 సంవత్సరాల క్రితం వరకు వీళ్ళు బట్టలు లేకుండానే తిరిగేవాళ్ళంట. ఒరిస్సా ప్రభుత్వం, ‘బొంఢా డెవలప్‌మెంటట్ అధారిటీ’ ఏర్పాటు చేసి, వీళ్ళలో కొంత మార్పు తీసుకొచ్చారు. ఇప్పటికీ అటవీ జంతువులను వేటాడి కాల్చుకుని తింటుంటారు. ఉప్పు, కారం, నూనెలు అత్యంత ప్రమాదకరమజనవి అని వీళ్ళ నమ్మకం. వీళ్ళ గ్రామాల్లో ఒక రాత్రి నివసించాలంటే, లోకల్ గైడ్ ద్వారా సుమారు 30 km కాలి నడక దారోలో కొండ కోనల్లో ప్రయాణం చేస్తే వారి మొదటి గ్రామం వస్తుంది. పురుషులకు మాత్రమే ప్రవేశం. అక్కడకు వెళ్ళిన తర్వాత ఆరోజు వేటలో దొరికిన అడవి జంతువుల మాంసం, అడవిలో దొరికే మత్తు పానీయాలూ మనకు ఉచితంగా అందిస్తారు. సుమారు 40 సంవత్సరాల క్రితం జర్మనీ నుంచి వచ్చిన ఒక ఆంత్రొపాలజిస్ట్ కొన్ని సంవత్సరాలు వీళ్ళతో కలిసి వీరి భాషను నేర్చుకుని స్థానిక మహాళను ఆకట్టుకుని, ఆమనిషితో సహజీవనం చేసి, పిల్లలను కన్నారు. అక్కడికెళ్ళినోళ్ళకి ఆ జర్మన్ బ్రీడ్ ఇప్పటికీ కనబడుతుంటుంది.
తన మనస్సును అత్యంతగా నచ్చిన ఒక బొంఢా జాతి స్త్రీని తనతోపాటు జర్మనీ తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళఅళినామె, భర్తతో కలిసి అప్పుడప్పుడూ తన జాతి ప్రజలను కలుసుకోడానికి వస్తుంటుంది. ఇప్పటికీ ఆమె విచిత్ర వేషధారణ మారలేదు. బొంఢా జాతి ప్రజల ప్రధాన ఆహారము మాంసం, మత్తు పానీయాలు.
ఫొటోలు తీయడానికి ఇష్టపడరు. కానీ 10 రూపాయలు ఇస్తే కొంత మంది ఫొటోలు తీయడానికిఅంగీకరిస్తారు. సరైన వైద్య సదుపాయాలు లేక త్వరలో ఈ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. సంతలో అనేక రకాలైన వనమూలికలు దొరుకుతాయి.
చూడాల్సిన ప్రదేశాలు దారిలో డుడుమా జలపాతం, మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం.
అరకు నుంచి ఓనక ఢిల్లీకి రోడ్డు చాలా బాగుంటుంది. 88km BSNL నెట్వర్క్ ఇక్కడ పనిచేస్తుంది.