జైట్లీ ఆరోగ్యం పై రాహుల్ గాంధీ భావోద్వేగం!!

జైట్లీ ఆరోగ్యం పై రాహుల్ గాంధీ భావోద్వేగం!!

arunjaitley

న్యూఢిల్లీ:

మూత్రపిండాల వ్యాధి తీవ్రం కావడంతో చికిత్స కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా వెళ్లారు. జైట్లీ అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగా లేదని తెలిసి తను చాలా చలించిపోయానని రాహుల్ తెలిపారు.ఆయన ఆలోచన విధానంతో విభేదించి తను రోజూ గొడవ పడుతుంటానని గుర్తు చేసుకున్నారు. జైట్లీ త్వరగా కోలుకోవాలని తను, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ప్రేమ, శుభాభినందనలు పంపుతున్నామని చెప్పారు. జైట్లీ వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కష్టకాలంలో తాము 100% ఆయన, ఆయన కుటుంబంతో వెన్నంటి ఉన్నామని పేర్కొన్నారు.సుమారు 66 ఏళ్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత ఏడాది మే నెలలో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో మూత్రపిండాల మార్పిడి కోసం పరీక్షలు చేయించుకొని అమెరికా వెళ్లారు. ఈ వారాంతాని కల్లా జైట్లీ తిరిగి స్వదేశానికి వస్తారని తెలిసింది. ఫిబ్రవరి 1న ఆయన ఆరోది, చివరిదైన బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సాధారణ ఎన్నికలకు ముందు ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్ లో రాబోయే కొద్ది నెలల కాలానికి ప్రభుత్వ వ్యయం కోసం పార్లమెంట్ అనుమతి కోరతారు.