అటవీ అధికారులపై పోడు సాగుదారుల దాడి!!

Kothagudem:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపడు పంచాయితీ పరిధిలో అటవీ అధికారులపై అర్థ రాత్రి పొడుసాగుదారుల దాడి. సోమవారం అర్థ రాత్రి పొడుభూముల్లో ట్రాక్టర్లు దున్ను తున్నాయి అన్న సమాచారంతో అటవీ అధికారుల బృందం క్షేత్ర స్థాయి లోకి వెళ్ళింది. ఈ క్రమంలో ట్రాక్టర్లకు కాపలాగా ఉన్న కొందరు ఫారెస్ట్ అధికారుల రాకను గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. దుక్కిదున్నే మూడు ట్రాక్టర్లను తీసుకొని బేస్ క్యాంప్ కు వస్తున్న క్రమంలో అధికారులపై కర్రలతో దాడిచేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ లు గుంజుకున్నట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన అధికారులను ఉన్నతాధికారులు ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.