అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన 21 మంది బంగ్లాదేశీల అప్పగింత.

అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన 21 మంది బంగ్లాదేశీల అప్పగింత.
bangladesi unauthorised entry to assam

గౌహతి

భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన 21 మంది బంగ్లాదేశీలను అస్సాంలో పట్టుకున్న సరిహద్దు పోలీసులు బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించారు. పాస్ పోర్ట్ చట్టాన్ని అతిక్రమించినందుకు వారిని వివిధ ప్రదేశాలలో అరెస్ట్ చేసి సిల్చార్ సెంట్రల్ జైల్ లోని నిర్బంధ శిబిరంలో ఉంచారు. కరీంగంజ్ లో 15 మందిని, కాచార్ జిల్లాలో ప్రవేశిస్తుండగా మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ అనుమతి రాగానే వారిని ఇవాళ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కి అప్పజెప్పారు. భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉన్న సుతార్ కండి-కరీంగంజ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ ద్వారా వారిని బంగ్లాదేశ్ లోకి పంపించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ (సవరణ) బిల్లుపై భారీ నిరసనలు పెల్లుబుకుతున్న సమయంలో ఈ అప్పగింతలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జనవరి 8న పౌరసత్వ చట్టం-1955కి సవరణ చేసే బిల్లు ఆమోదముద్ర పొందింది. పొరుగున ఉన్న మూడు దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర వలసదారులకు భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు ఈ బిల్లు ఉద్దేశించబడింది.