ప్రచార కమిటీ చైర్మన్ భట్టిని కలిసిన గద్దర్. కేసీఆర్ పై సాంస్కృతిక యుద్ధం.

హైదరబాద్:
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ శనివారం భేటీ అయ్యారు. ఆయనతో సుదీర్ఘ సమయంపాటు సమావేశం అయ్యారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సామాన్య ప్రజల కోసం కవులు, కళాకారులు, ప్రజా యుద్ద నౌక గద్దర్ వంటి వారు కలిసిరావలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ కలిసి ముందుకు రావాలని ఆయన చెప్పారు. ఏ ఆశయాలు, లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని చేరుకునెందుకు పీపుల్స్ గవర్నమెంట్ ను ఏర్పాటు చేసుకునేందుకు అందరూ కలిసి రావాలని విక్రమార్క చెప్పారు.”నడుస్తున్న పొద్దుమీద కదులుతున్న కాలమా.. పోరు తెలంగాణమా… అన్న గీతం లక్ష్యాలను చేరుకుందామ”ని విక్రమార్క అన్నారు.