నాలుగున్నరేళ్లలో 50% పెరిగిన అప్పులు.. రూ.82 లక్షల కోట్ల బకాయిలు.

నాలుగున్నరేళ్లలో 50% పెరిగిన అప్పులు..
రూ.82 లక్షల కోట్ల బకాయిలు.

BJP Government loans
ప్రకాశ్, న్యూఢిల్లీ:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తమ హయాంలో సాధించిన విజయాలను తరచుగా దండోరా వేస్తుంటుంది. రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రజాకర్షక పథకాలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. వీటితో దేశ ఖజానాలో లోటు భారీగా పెరిగిపోతోంది. తాజాగా ఒక నివ్వెరపరిచే వార్త వెలుగు చూసింది. గడచిన నాలుగున్నరేళ్ల మోడీ సర్కార్ హయాంలో 50% అప్పులు పెరిగాయి. వీటి విలువ రూ.82 లక్షల కోట్లకు పైమాటే. శుక్రవారం ప్రభుత్వ వ్యయంపై విడుదల చేసిన స్టేటస్ పేపర్ 8వ ఎడిషన్ లో ఈ విషయాలు బయటపడ్డాయి.కేంద్ర ప్రభుత్వంపై మొత్తం ప్రభుత్వ వ్యయం రూ.82 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పులపై ఆర్థిక మంత్రిత్వశాఖ తన డేటాను సెప్టెంబర్ 2018 నాటి అంకెలతో పోల్చింది. దీని ప్రకారం సెప్టెంబర్ 2018 వరకు కేంద్ర సర్కార్ మొత్తం రూ.82.03 లక్షల కోట్లు అప్పు చేసింది. జూన్ 2014 నాటికి ప్రభుత్వంపై మొత్తం రూ.54.90 లక్షల కోట్ల అప్పుంది. ఈ విధంగా మోడీ సర్కార్ పాలనా కాలంలో దేశంపై సుమారుగా రూ.28 లక్షల కోట్ల అప్పు పెరిగిపోయింది. పబ్లిక్ డెట్ లో ప్రభుత్వ ఖర్చు పెరిగింది.ఈ కాలంలో పబ్లిక్ డెట్ లో ప్రభుత్వ వ్యయం వాటా 51.7% పెరిగి రూ.48 లక్షల కోట్ల నుంచి పెరిగి రూ.73 లక్షల కోట్లు అయింది. అంతర్గత రుణాలలో 54% పెరిగి రూ.68 లక్షల కోట్లు కావడాన్ని దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
రూ.52 లక్షల కోట్లయిన మార్కెట్ లోన్లు.ఈ కాలంలో మార్కెట్ లోన్లు 47.5% పెరిగి రూ.52 లక్షల కోట్లకు పైగా చేరాయి. జూన్ 2014 చివరికి గోల్డ్ బాండ్ల ద్వారా ఎలాంటి అప్పులు చేయలేదు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ సహా ఇది రూ.9,089 కోట్ల దగ్గర ఉంది.