బీఎండబ్ల్యు ఎక్స్4 కారు విడుదల.

బీఎండబ్ల్యు ఎక్స్4 కారు విడుదల.

న్యూఢిల్లీ:

ప్రఖ్యాత కార్ల తయారీ దిగ్గజ సంస్థ బీఎండబ్ల్యు భారత్ లో తన సరికొత్త ఎక్స్4 కార్ లాంచ్ చేసింది. చెన్నైలోని కంపెనీ ప్లాంట్ లో ఎక్స్4 కార్ తయారైంది. బిఎండబ్ల్యు ఎక్స్4ని డీజిల్, పెట్రోల్ రెండు వేరియంట్లలోనూ విడుదల చేసింది. ఈ కార్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బిఎండబ్ల్యు డీలర్ల దగ్గర ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉంటాయి. కొత్త బీఎండబ్ల్యు ఎక్స్4 డీజిల్ వేరియంట్స్ రెండు మోడళ్లలో – బీఎండబ్ల్యు ఎక్స్4 ఎక్స్ డ్రైవ్20డి ఎం స్పోర్ట్ ఎక్స్, ఎక్స్4 ఎక్స్ డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్ ఎక్స్, బీఎండబ్ల్యు ఎక్స్4 ఎక్స్ డ్రైవ్ 30ఐ ఎం స్పోర్ట్ ఎక్స్ పెట్రోల్ వేరియంట్లలో తయారు చేయడం జరిగింది. ఇవి భారత రోడ్లకు అనుగుణాంగా తయారయ్యాయి. బిఎండబ్ల్యు ఎక్స్4 ఎక్స్ డ్రైవ్20డి ఎం స్పోర్ట్ ఎక్స్ ఎక్స్ షోరూం ధర రూ.60.60 లక్షలుగా నిర్ణయించారు. బీఎండబ్ల్యు ఎక్స్4 ఎక్స్ డ్రైవ్30డి ఎం స్పోర్ట్ ఎక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.65.90 లక్షలుగా ఉండనుంది. కార్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్ డ్రైవ్30ఐ ఎక్స్ షోరూమ్ వెల రూ.63.50 లక్షలు.కొత్త బీఎండబ్ల్యు ఎక్స్4కి కూప్ తరహా రూఫ్ లైన్ అమర్చారు. ఈ కొత్త కారుని కంపెనీ తన సరికొత్త CLAR ప్లాట్ ఫామ్ పై నిర్మించింది. దీంతో కారు బరువు తగ్గింది. అలాగే కేబిన్ స్పేస్ పెరిగింది. ఫీచర్స్ విషయంలో కొత్త బిఎండబ్ల్యు ఎక్స్4 బాగా అడ్వాన్స్ గా ఉంది. ఎన్నో హైటెక్ ఫీచర్లతో వస్తోంది. కొత్త బీఎండబ్ల్యు ఎక్స్4లో 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజన్ అమర్చారు. ఇది 261 బీహెచ్ పీ పవర్, 620 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ కేవలం 6 సెకన్లలో 0-100కి.మీ/గంటలకు వేగాన్ని అందుకుంటుంది.కొత్త బీఎండబ్ల్యు ఎక్స్4 ఎక్స్ డ్రైవ్20డీలో 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ ఇచ్చారు. ఇది 188 బీహెచ్ పి పవర్, 400 ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు 0-100కిమీ/గంటలకు వేగాన్ని అందుకొనేందుకు కేవలం 8 సెకన్ల సమయం తీసుకుంటుంది. ఎక్స్ డ్రైవ్30ఐలో కంపెనీ 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడింది. ఇది 248 బీహెచ్ పి పవర్, 350 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ పెట్రోల్ వేరియంట్ కారు 6.3 సెకన్లలో 0-100కి.మీ/గంటకు వేగానికి చేరుకోగలదు. కారులో 6.5 అంగుళాల డిస్ ప్లే ఇచ్చారు. వినియోగదారుల కోరిక మేరకు 10.3 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఇస్తామని కంపెనీ తెలిపింది.