బోఫోర్స్ కు సీబీఐ గుడ్ బై!!

బోఫోర్స్ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ గురువారం ఉపసంహరించుకొంది. తాము 1 ఫిబ్రవరి 2018లో దాఖలు చేసిన పిటిషన్ ను వాపసు తీసుకోవాలనుకుంటున్నట్టు దర్యాప్తు సంస్థ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ కశ్యప్ కి విజ్ఞప్తి చేసింది. దీనికి కోర్టు అనుమతించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐ ట్రయల్ కోర్టు అనుమతి కోరింది.


ఈ కేసుకి సంబంధించిన అదనపు పత్రాలు, సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నట్టు ఏజెన్సీ చెప్పింది. కానీ కోర్టు నిర్ణయం వెలువడక ముందే దర్యాప్తు సంస్థ తన పిటిషన్ ఉపసంహరించుకొంది. ఈ కేసు దర్యాప్తునకు ఏజెన్సీకి కోర్టు అనుమతి ఎందుకు అవసరమైందని 4 డిసెంబర్ 2018న న్యాయస్థానం సీబీఐని ప్రశ్నించింది. వ్యక్తిగత పిటిషనర్ అజయ్ అగర్వాల్ కూడా బోఫోర్స్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిసన్ వాపసు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు.

1986లో స్వీడన్ కి చెందిన ఆయుధాల తయారీ సంస్థ బోఫోర్స్ భారత సైన్యానికి 155 ఎంఎం 400 ఫిరంగులను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. ఈ డీల్ విలువ 1.3 బిలియన్ డాలర్లు. 1987లో ఈ విషయం వెలుగు చూసింది. ఈ కాంట్రాక్ట్ పొందేందుకు భారత్ లో రూ.64 కోట్ల ముడుపులు ముట్టాయని మీడియా రిపోర్టులు వెల్లడి చేశాయి. అప్పుడు కేంద్రంలో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పీఠంపై ఉంది. 16 ఏప్రిల్ 1987లో స్వీడిష్ రేడియో ముడుపులు ముట్టడం గురించి తెలిపింది. దీనినే బోఫోర్స్ కుంభకోణంగా వ్యవహరిస్తున్నారు.

India, National, Bofors, Bofors Gun Deal, Bofors Payoff Case, CBI, Central Bureau of Investingation Delhi, Delhi Court, Navin Kumar Kashyap, Ottavio Quattrocchi, Rajiv Gandhi, Corruption&Bribery, Bofors Case, Bofors Scam, Probe,