మరాఠా కోటాకు బాంబే హైకోర్ట్ ఓకే

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై రాజ్యాంగ ప్రామాణికతను బాంబే హైకోర్ట్ గురువారం సమర్థించింది. జస్టిస్ రంజిత్ మోరె, జస్టిస్ భారతీ డాంగ్రేల ధర్మాసనం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల కమిషన్ సిఫార్సు చేసిన 16 శాతం రిజర్వేషన్లు 12-13 శాతం ఉండాలని అభిప్రాయపడింది.

మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరాఠాలకు ప్రభుత్వోద్యోగాలు, విద్యలో 16 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ని విచారిస్తూ బాంబే హైకోర్ట్ ఈ తీర్పునిచ్చింది.

మరాఠాలను సామాజిక, ఆర్థిక పరంగా వెనుకబడిన వర్గాలుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నవంబర్ 30, 2018న మహారాష్ట్ర శాసనసభ ఒక బిల్లు పాస్ చేయడంతో ఉద్యోగాలు, విద్యలో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు ఇచ్చే మార్గం సుగమమైంది.