సాయ్ ఆఫీస్ పై సీబీఐ దాడులు.. పలువురి అరెస్ట్

సాయ్ ఆఫీస్ పై సీబీఐ దాడులు.. పలువురి అరెస్ట్
null

న్యూఢిల్లీ లోఢీ రోడ్డు ప్రాంతంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికార కార్యాలయంపై సీబీఐ గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దాడులు చేసింది. రెండు నెలల క్రితం సంస్థలో కొందరు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐని దర్యాప్తునకు ఆదేశించారు. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం దగ్గర ఉన్న సాయ్ హెడ్ క్వార్టర్స్ చేరుకున్న సీబీఐ అధికారులు ముందుగా మొత్తం కార్యాలయ ఆవరణను సీల్ చేశారు. సోదాల సందర్భంగా సాయ్ డైరెక్టర్ ఎస్ కె శర్మ, ఆయన సహచరులు ముగ్గురు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తూనే తనిఖీలు కొనసాగిస్తోంది. సాయ్ లో అవినీతిని సహించేది లేదని.. లంచగొండితనానికి వ్యతిరేకంగా చేపట్టే అన్ని చర్యలకు మద్దతిస్తామని సాయ్ డీజీ నీలమ్ కపూర్ తెలిపారు.