ప్రియాంక ఆరంగేట్రంపై పార్టీ శ్రేణుల సంబరం!!

ప్రియాంక ఆరంగేట్రంపై పార్టీ శ్రేణుల సంబరం!!

celebrations in congress party

న్యూఢిల్లీ:

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ ఆరంగేట్రం ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లోకి వచ్చేశాయి. ‘ప్రియాంక గాంధీ ఆంధీ హై, దూస్రీ సోనియా గాంధీ హై’ అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ, సోనియా గాంధీ ఎన్నికైన రాయ్ బరేలీలో ప్రియాంకను పార్టీ జనరల్ సెక్రటరీగా చేయడంపై కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టపాకాయలు కాల్చి, డాన్సులు చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటున్నారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సైతం పండుగ వాతావరణం నెలకొందది. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు లడ్డూలు పంచారు. డోలు వాయిస్తూ చిందులు తొక్కారు. బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.