సిఐ నిర్మల కు తీవ్ర గాయాలు.

సిఐ నిర్మల కు తీవ్ర గాయాలు.

CI Nirmala

హైదరాబాద్:

కారు బోల్తా పడిన ఘటనలో సి.ఐ నిర్మల తీవ్రంగా గాయపడ్డారు.కారులో ప్రయాణిస్తున్న ఆమె కూతురు, కుమారుడు క్షేమంగా ఉన్నారు. తన సొంత గ్రామం నల్గొండ జిల్లాకు వెళ్లి వస్తుండగా సోమవారం ప్రమాదం ప్రమాదానికి గురయ్యారు.సూర్యాపేట వద్ద తిరుమలగిరి గ్రామం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ప్రస్తుతానికి నిర్మల హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పినప్పటికి, తీవ్ర గాయాల పాలైన నిర్మల కొలుకొనేందుకు చాలా కాలం పట్టె అవకాశాలు ఉన్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడం చేత శరీరంలో కొంత భాగం అచేతనమైంది. ప్రమాదం జరిగినప్పుడు ఆమె స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. షాద్ నగర్ లో గతంలో ఆమె ఎస్సైగా, ఆతర్వాత సిఐగా పనిచేశారు. ఇక్కడ ఆమె ప్రజల మన్ననలను చూరగొన్నారు. వికారాబాద్ మహిళా సిఐగా కూడ పని చేశారు. ప్రస్తుతం ఆమె విజిలెన్స్ శాఖలో సంగారెడ్డి ప్రాంతంలో పని చేస్తున్నారు.