సినీనటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ.

సినీనటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ.

Heart Surgery for Cine Comedian Actor Brahmanandham

ముంబాయి:

తెలుగు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం(62)కు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్(ఏహెచ్‌ఐ)లో ఆయనకు ఆపరేషన్ జరిగినట్లు బ్రహ్మానందం కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఏహెచ్‌ఐకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. హార్ట్ సర్జన్ రమాకాంత్ పాండా సోమవారం బ్రహ్మానందంకు సర్జరీ చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన కొడుకులు రాజా గౌతమ్, సిద్దార్థ్ ఆసుపత్రిలో దగ్గరుండి చూసుకున్నారు. బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ట్వీట్స్, కామెంట్స్ చేశారు. బ్రహ్మానందం మొత్తం 1000కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.