రోడ్లు అద్దం వలె మారాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్.

రోడ్లు అద్దం వలె మారాలి.
– ముఖ్యమంత్రి కేసీఆర్.

CM KCR

తెలంగాణలోని రోడ్లన్నీ అద్దంలా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఆయన శనివారం ప్రగతిభవన్ లో రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారులకే ప్రాధాన్యం ఇస్తుందని కేసీఆర్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రహదారులను అద్దంలా మార్చుతామన్నారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా, రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బీటీ రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి ప్రతీ రోడ్డు పరిస్థితిని సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు. ఏ జిల్లా, ఏ మండలం అనే తేడా లేకుండా.. అక్కడ ఏ పార్టీ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం పక్కన బెట్టి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్ల మరమత్తులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఐఏఎస్ అధికారులు సునీల్ శర్మ, రామకృష్ణరావు, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.