‘కోడ్’ఉల్లంఘన పై ఫిర్యాదు.

హైదరాబాద్:

తెలుగుదేశం ప్రతినిధి బృందం ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది.అసెంబ్లీ రద్దు ఆయున నాటి నుండి కోడ్ ఆఫ్ కాండక్టు మొదలు అయినా మంత్రులు ,ఎమ్మెల్యే లు ఎన్నికల కోడ్ ఉల్లగిస్తున్నారని ఈ బృందం ఫిర్యాదు చేసింది.

అధికారికంగా అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారని తెలిపింది.మంత్రులు ఇష్టం వచ్చినట్లు జిఓ లు ఇస్తున్నారని టిటిడిపి నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం 500 పైగా జిఓ లు ఇచ్చిందని,ప్రభుత్వం నచ్చిన వారికి పదవి కాలం పొడిగించిందన్నారు.ఓటర్లను తమ వైపు తింపుకునేందుకు డబ్బు ఇస్తాం అని బహిరంగంగా చెప్తున్నారని ఫిర్యాదు చేశారు.

డబ్బులను ఇష్టం వచ్చినట్లు పంచుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సైట్ పై సీఎం కేసీఆర్, మంత్రుల ఫొటో లు ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రుల ఫొటోలతో చేస్తున్న ప్రచారం ఎన్నికల నియమావళి కి విరుద్ధమన్నారు.వ్యక్తులకు నేరుగా డబ్బులు, (రైతు బంధు స్కిం, బతుకమ్మ చీరలు) పరికరాలు ఇవ్వటం ఎన్నికల నియమావళి కిందికి వస్తాయన్నారు.సెప్టెంబర్
6 నుండి 27 తేదీ వరకు జరిగిన పనులు అన్ని రద్దు చెయ్యాలని ఈ.సి.ని కోరారు. ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరుగకుండా చూసుకోవాలి అని ఎన్నికల అధికారులను కోరారు
వస్తువులు, పరికరాలు పంచెవి అన్ని వెంటనే ఆపాలని కోరారు.వ్యక్తులకు లబ్ధిచేకూరే అంశాలపై ఎన్నికల సంగం దృష్టి సారించాలన్నారు.