అభ్యర్థుల ఎంపిక పూర్తి.

 

హైదరాబాద్:

స్క్రీనింగ్ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకున్నట్టు,అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్టు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు.సర్దార్ పటేల్ దేశానికి మొట్టమొదటి డిప్యూటీ ప్రధాని,హోమ్ మినిష్టర్ అని, ఆయనను బీజేపీ మనిషిగా చిత్రీకరించడం దారుణమని చెప్పారు. దేశ సమగ్రతకోసం పనిచేసిన ఒక మనిషిని ఒక వర్గానికె పరిమితం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.నిజాం పాలనను అంతమొందించి హైద్రాబాద్ సంస్థానంను భారత్ లో కలపడంలో సర్దార్ చేసిన సేవలు మర్చిపోలేమన్నారు.సర్దార విగ్రహం పెడుతున్నాం అని అన్ని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారని తెలిపారు.ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు మరిచిపోలేనివని చెప్పారు.

దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించిన మహిళను మోడీ ప్రభుత్వం మరిచిపోవడం దారుణమని గూడూరు విమర్శించారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తున్న మోడీ ప్రభుత్వం ను దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.గరీభీ హఠావో నినాదంతో పేదరిక నిర్ములనకు ఇందిరా గాంధీ కృషి చేసిందన్నారు.
కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు మోడీ కానీ 5లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.

పెద్ద పెద్ద జాతీయ సంస్థలను నెలకొల్పిన ఘనత ఇందిరా గాంధీదన్నారు.ఇందిరా గాంధీని ప్రజలు విస్మరించేలా కుట్ర జరుగుతుందన్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని టీపీసీసీ కోశాధికారి చెప్పారు.