డిసెంబర్ 11 న కేటీఆర్ రాజకీయ సన్యాసం.

Madhu

డిసెంబర్ 11 న కేటీఆర్ రాజకీయ సన్యాసం.

– మధుయాష్కీ.

హైదరాబాద్:

డిసెంబర్ 11 న కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడో, సన్యాసులలో కలుస్తాడో నిర్ణయించుకోవాలని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ అన్నారు.కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ -జేడీఎస్ కూటమి ఘనవిజయం దేశరాజకీయాలకు మలుపు కాబోతున్నాయని చెప్పారు.మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గాలి వీస్తుంది అనడానికి కర్ణాటక ఫలితాలే సాక్షంగా ఆయన చెప్పారు.రాబోయే ఐదు రాష్ట్రాల ఫలితాలు ఇలానే ఉంటాయన్నారు.
తెలంగాణ లో మహాకూటమి విజయం సాధించడం ఖాయమన్నారు.మహాకూటమికి, బీజేపీ, టీఆరెస్ ల మాయాకూటమి కి మధ్య పోటీ జరుగుతున్నట్టు మధుయాష్కీ చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవినీతిపరుడు కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అని ఆయన అన్నారు.టీఆరెస్ ప్రతి నియోజకవర్గానికి పది కోట్లు ఖర్చుపెట్టేందుకు కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు.ఇప్పడికే నియోజకవర్గాల్లో లిక్కర్ కోసం మూడుకోట్లు టీఆరెస్ పంచేసిందన్నారు.ప్రజాకూటమిలో అన్నివర్గాలకు సమాన గౌరవం ఉంటుందన్నారు.టీఆరెస్ లా కాకుండా బడుగు బలహీన వర్గాలు ,మహిళలు ,మైనార్టీలకు మహాకూటమిలో గౌరవం ,ప్రాధాన్యత ఉంటుందని మధు యాష్కీ చెప్పారు.ప్రగతి భవన్ ను ప్రజలకు పంచుతామన్నారు.టీఆరెస్ లా గల్లీ పార్టీకాదు కాంగ్రెస్ జాతీయ పార్టీ అని అన్నారు.మోడీకి కేసీఆర్ గులాం ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు.గల్ఫ్ కార్మికుల కోసమంటూ వెళ్లి ..కేటీఆర్ ,కవిత ,హరిశ్ లు దుబాయిలో జల్సా చేసుకున్నది నిజం కాదా .? అని ప్రశ్నించారు.గల్ఫ్ కార్మికులు కస్టాలు పడుతున్నా ..కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఈనెల 9 న దుబాయిలో గల్ఫ్ కార్మికులు ఏర్పాటు చేసిన సభలో నేను ఉత్తమ్ ,షబ్బిర్ ఆలీ పాల్గొంటామని తెలిపారు.గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు.