ఢిల్లీలో ఈవీఎం హ్యాకింగ్ కు బ్రేక్!!

ఢిల్లీలో ఈవీఎం హ్యాకింగ్ కు బ్రేక్!!

Delhi EVM Hacking Break

– సైబర్ నిపుణుడు షుజా:

వాషింగ్టన్:

ఢిల్లీ శాసనసభకు 2015లో జరిగిన ఎన్నికల్లో ‘ఈవీఎం హ్యాకింగ్’ ను అడ్డుకోగలిగినట్టు సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా తెలిపారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ట్రాన్స్ మిషన్ సిగ్నల్ ని అడ్డుకోగలిగామని వివరించారు. దీంతో ‘ఆప్’ 70 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో విజయం సాధించిందని లేకపోతే బీజేపీ క్లీన్ స్వీప్ చేసేదని అన్నారు. ఆ తర్వాత బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ ఈవీఎం హ్యాకింగ్ చేయొచ్చా? లేదా? అని తెలుసుకొనేందుకు తమను సంప్రదించాయన్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆప్ పార్టీలు ఈవీఎం రిగ్గింగ్ గురించి తెలుసుకోగోరాయని తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ ఈవీఎంలను తాము ఏమైనా చేయొచ్చా అని అడిగినట్టు షుజా చెప్పారు. ఏ విధంగానైనా సాయపడగలమా అని తాము కాంగ్రెస్ పార్టీని సంప్రదించినట్టు సయ్యద్ షుజా వివరించారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ప్రపంచానికి చెప్పేందుకు ఆప్ తమను సంప్రదించిందని తెలిపారు.2014 నుంచి ఈవీఎంల హ్యాకింగ్ జరుగుతోందని షుజా చెప్పారు. మొన్న జరిగిన ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈవీఎంలను రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. తాను, తన బృందం బీజేపీ ప్రయత్నాలను గుర్తించి వమ్ము చేశామని.. లేకపోతే ఈ ఎన్నికల్లో కూడా ఆ రాష్ట్రాల్లో బీజేపీయే గెలిచి అధికారాన్ని చేపట్టేదని అన్నారు.