‘దేవ దాస్’ సినిమాకు ‘మాతృక’.

“Analyze This”: Harold Rammis దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999 లో విడుదలైంది, దీనికి సీక్వెల్ గా “Analyze That” కూడా 2002 లో వచ్చింది.Robert De Niro మాఫియా డాన్ గా ,Billy Crystal సైకియాట్రిస్ట్ గా నటించిన చిత్రమిది.ఇక కథలోకి వస్తే Paul Vittie న్యూయార్క్ లో ఓ పవర్ఫుల్ మాఫియా డాన్,కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి తుపాకీ గుల్ల కు బలవుతాడు.క్రైమ్ సిండికేట్ ను శాసించాలిసి న తను, క్రమంగా మానసిక ఒత్తిడి కి లోనై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్ర సరిగ్గా రాకపోవడం, erectile disfunction లాంటి సెక్స్ సమస్యలకు లోనవుతుంటాడు.ఈ విషయాన్ని పనిమనిషి కనిపెడుతుంది.శక్తివంతుడైన vittie ఇలాంటి మానసిక శారీరక సమస్యలతో భాధపడుతున్నడని ప్రత్యర్థులకు తెలిస్తే అది తన ఉనికికే ప్రమాదం.ఓ మంచి సైకియాట్రిస్ట్ ను కలవాలన్న తలంపుతో ఉంటాడు, అనుకోకుండా ఒకరోజు “బెన్ సోబెల్ “అనే సైకియాట్రిస్ట్ పరిచయమవుతాడు.మొదటి భార్య కు డివేర్స్ ఇఛ్చి ఒక్కగానొక్క కొడుకుతో కాలం గడుపుతూ , త్వరలోనే గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొనే ప్రయత్నాల్లో ఉంటాడు Ben Sobel.వృత్తిలో challenging కేస్ ను డీల్ చేయలేదన్న అసంతృ తొలుస్తూ ఉంటుంది.Paul Vittie కి Sobel పేషెంట్స్ ని డీల్ చేసే విధానం,తన వ్యక్తిత్వం నచ్చుతుంది,తనంటే అభిమానాన్ని ఏర్పరుచుకుంటాడు.కథ ఇలా సాగుతుండగా వీరిద్దరి మధ్య FBI ప్రవేశించి అపోహలను సృష్టిస్తుంది.చివరికి ఇద్దరు realise అవుతారు.చివరికి Paul Vittie మాఫియా నుంచి రిటైర్ అయి పోలీసులకు సరెండర్ అవుతాడు, S weobel గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లిచేసుకోవడం తో కథ సుఖాంతమవుతుంది.ఈ కథే ‘దేవ దాసు’ కి సూర్తి అయ్యి ఉంటుంది.