డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రైవేట్ సేనాధిపతి. – రేవంత్ రెడ్డి.

ప్రభుత్వ రద్దుకు ముందు కేసీఆర్,కేటీఆర్ చేపట్టారని,కొన్ని సార్లు అధికారికంగా,కొన్నిసార్లు రహస్యంగా పర్యటన చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఓటుకు నోటు కేసు మళ్లీ బయటకు తీస్తున్నట్టు చెప్పారు. A4 గా ఉన్న మత్తయ్య ఖ్వాష్ పిటిషన్ ఎస్తే అక్రమంగా కేసులు పెట్టాడని చెప్పారు.FIR చేయకుండా అరెస్ట్ చేయడం అక్రమం అని మత్తయ్య మీద కేసును కోర్టు వేసినట్టు రేవంత్ గుర్తు చేశారు. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడాడని ఇరికించారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదన్నారు. ఇప్పుడు కేసీఆర్,మోడీ రహష్య ఒప్పందం ద్వారా మరోసారి కేసును తిరగదోడుతున్నట్టు రేవంత్ ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు నచ్చక చంద్రబాబు ప్రభుత్వం నుండి బయటకి వచ్చాడని ఆయన తెలిపారు. ఈ కేసీఆర్,మోడీ ఈడీ, సీబీఐ ద్వారా ఓటుకు నోటు కేసు పైన తన పైన,తన బందువులపైన ఇంకమ్ టాక్స్ దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుందని ఆయన ఆరోపించారు.ప్రణాళిక బద్దంగా తనపై పై నకుటుంబ సభ్యులు పైమ ఈడీ దాడులు చేయాలని సిద్ధమైందని ఆరోపించారు.రాబోయే రోజులు అత్యంత కీలకం. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించి కేసీఆర్ కు సహకరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.డీజీపీ పాత డేట్లతో తనపై విచారణకు లేఖలు రాస్తున్నారని అన్నారు. చట్టవ్యతిరేకమైన చర్యలతో ప్రైవేట్ సైన్యంతో డీజీపీ కేసీఆర్ కు కాసిమ్ రాజ్వి లాగా చేస్తున్నాడన్నరు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా,కేసీఆర్,ప్రభాకర్ రావు ,డీజీపీలే కారణం
అని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తనకు ముఖ్యమైన పదవి ఇచ్చే అవకాశం ఉండటంతో,రాష్ట్రం అంతా తిరుగుతానని ఇలాంటి పనులకు టీఆరెస్ పార్టీ, కేసీఆర్ కుట్ర చేస్తున్నట్టు ఆయన చెప్పారు. “రేవంత్ రెడ్డి మీద ఈడీ దాడులు జరుగుతాయి” అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ మెస్సేజ్ ఇచ్చారని రేవంత్ తెలిపారు.డీజీపీ మహేందర్ రెడ్డ కేసీఆర్ ప్రైవేట్ సైన్యానికి అధిపతి అని ఆరోపించారు.
తనకు పదవి ఇచ్చే రెండు రోజులముందే తనపై పై ఈడీ దాడులు జరుగనున్నట్టు ఆరోపించారు.
చిప్పకుడు తిన్న విశ్వాసంతో చెప్తున్నానని మీ పైజామాలు ఉడుతాయని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.